చిత్రం: వరుడు కావలెను (2021)
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నాగ శౌర్య , రీతు వర్మ, నదియా
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
విడుదల తేది: 26.03.2021
చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
పువ్వులా నా ఊహల గుమ్మంలో
తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే
కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే
మౌనంగా నా ఊపిరే
దూరమున్నా చేరువవుతూ
చెప్పుకుందే నాలోని ఈ తొందరే
కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే
నువ్వెల్లే దారులలో
చిరుగాలికి పరిమళమే
అది నన్నే కమ్మేస్తూ ఉందే
నా కంటి రెప్పలలో
కునుకులకిక కలవరమే
ఇది నన్నే వేధిస్తూ ఉందే
నిశినిలా విసురుతూ శశి నువ్వై మెరవగా
మనసులో పదనిసే ముసుగే తీసెనా
ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా
మన కదే మలుపులే కోరేనా
కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే
చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
నాన నానా నానా… హ్మ హ్ హ్మమ్మా
నాన నాననా నాన నానా నా
నాన నానా నానా… హ్మహ్ హ్ హ్మ
నాన నానా నా నాన నానా నా
మళ్ళి మళ్ళి రావే