చిత్రం: నేను పెళ్ళికి రెడీ (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: శ్రీకాంత్, లయ, అనిత,
మాటలు: సతీశ్ వేగేశ్న
దర్శకత్వం: వెంకీ
నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ్
విడుదల తేది: 14.11. 2003
చిత్రం: నేను పెళ్ళికి రెడీ (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్
గానం: హరిహరన్
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై
వచ్చి వాలితే చాలు చాలు చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
అవమానాలు ఎన్నెదురైన నువ్వుంటే చాలు
బహుమానాలు అక్కరలేదు నువ్వుంటే చాలు
కొండా కోన దాటొస్తాను నువ్వుంటే చాలు
మండుటెండలో నడిచొస్తాను నువ్వుంటే చాలు
నువ్వు నీడలాగా మారి నా తోడు వుంటే చాలు
నీ కౌగిలింతలో నేను మంచు లాగా
కరిగిపొతే చాలు చాలు చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
ఎవ్వరినైన ఎదిరిస్తాను నువ్వుంటే చాలు
ఎక్కడికైన ఎగిరొస్తాను నువ్వుంటే చాలు
ఎన్నటికైన కరుణిస్తావ అవునంటే చాలు
ఈ క్షణమే నే మరణిస్తాను ఊ అంటే చాలు
చీరుగాలి లాగా మారి నను తాకుతుంటే చాలు
నీ లేత బుగ్గ పై నేను సిగ్గు లా
మారి పొతే చాలు చాలు చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై
వచ్చి వాలితే చాలు చాలు చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు