నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా…
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా..
నెలవంకను ఇద్దామనుకున్నా…
ఓహ్ ఓహో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా..
నువ్వే.. నడిచేటి.. తీరుకే..
తారలు మొలిచాయి నేలకే.
నువ్వే.. వదిలేటి.. శ్వాసకు..
గాలులు బ్రతికాయి చూడవే.
ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే…
నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా…
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా..
ఓహో వానవిల్లులో.. ఉండని రంగు నువ్వులే..
ఏ రంగుల చీరను నీకు నేయాలి.
నల్ల మబ్బులా.. మెరిసే కళ్లు నీవిలే.
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే..
చెక్కిలిపై చుక్కగా.. దిష్టే పెడతారులే.
నీకైతే తనువంతా.. ఆ చుక్కను పెట్టాలె..
ఎదో ఇవ్వాలి కానుక…
ఎంతో వెతికాను ఆశగా..
ఏదీ నీ సాటి రాదిక..
అంటూ ఓడాను పూర్తిగా..
కనుకే ప్రాణమంతా తాళి చేసి… నీకు కట్టనా…
నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా…
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న..
ఓహో.. అమ్మ చూపులో.. ఒలికే జాలి నువ్వులే..
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలె..
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే..
నీ పాపనై పసి పాపనై… ఏమి ఇవ్వాలె..
దయ కలిగిన దేవుడే… మనలను కలిపాడులే..
వరమొసిగే దేవుడికే… నేనేం తిరిగివ్వాళే..
ఏదో ఇవ్వాలి కానుక… ఎంతో వెతికాను ఆశగా..
ఏదీ నీ సాటి రాదిక..
అంటూ అలిసాను పూర్తిగ…
కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి … నిన్ను చేరనా……
నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా…
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని.. మానేస్తూ ఉన్నా..
Movie: 30 Rojullo Preminchadam Ela
Singers: Sid Sriram, Sunitha
Music: Anup Rubens
Lyrics: Chandra Bose
Cast: Pradeep Machiraju, Amritha Aiyer