చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సాహిత్యం: శ్రీజో
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్
దర్శకత్వం: ఎస్. దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
విడుదల తేది: 2021
హే మనసెందుకిలా
నిలచిన చోటిక నిలవదుగా
ఈ కనులకు బహుశా
ఏమైందో తెలుసా
ఆ పెదవులు చేసే
మాయకు మాటలు చాలవిక
నా నడకలు నిన్నే
చేరక మానవుగా
అర క్షణముండదు తిన్నగ ప్రాణం
అలజడి పడి నిను విడదే
అది విని గుండెలనాపినా దూరం
మెల మెల్లగ కరిగినదే
దగ్గరైన కొద్ది దొరక్క జారకు
నీలి కళ్ళతోటి కొరక్క మానకు
ఆశ తీరకుంటే ఏకాంత మెందుకు
నిజము కదా
ఊపిరాడకంటే ఈ కౌగిలింతకు
ఎంత కోరికంటే ఓ గుండే చాలదు
ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు
జతపడవా
ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా
చెంత చేరమంటు సైగ చేస్తావే
ఆట లాడుతూనే ఒకటై కలిసే
మనసులివే
హా చంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా
గుండే ఎందుకుంది కేరింత కొత్తగా
ఊరుకోమనంటే ఆగేది కాదుగా మది సరదా
చెప్పలేక నీతో మనస్సు దాచగా
రెక్కలొచ్చి నట్టు వయస్సు గోలగా
ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా
ఎందుకని ఉండనీవు నన్ను ఊరికే
మాటలాడి మయలోకి తోస్తావే
ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే మన జగమే