చిత్రం: దిక్కులు చూడకు రామయ్య (2014)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ
దర్శకత్వం: త్రికోటి. పి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 10.10.2014
తేలిపోతున్నా తేలి మబ్బుల తేలే దూది పింజలా
చిగురాకుల చిలకి కల రెల్లు పువ్వు రేకుల పిల్ల లూదిన సబ్బి బూరల ఉల్లిపాయపై పొరలా
పరువాలు దాచే వీలు లేక తాళలేక
పైకి వెళ్లే పైట లాగ
తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా
నన్ను నేనే చూడకుండా
నాకు నేనే అందకుండా ఆకాశంలో
తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా
రెక్కలు ఇచ్చిన నువ్వే
నా పక్కన లేకుంటే ఎలా
నీతో పాటే ఎందాకైనా ఎగురుతున్నానిలా
ముచ్చట తీర్చిన నువ్వే
నా ముందర లేకుంటే ఎలా
ఎదిమ్మన్నా ఇట్టే ఇస్తా తీసుకో అలా
చాలా చేద్దాం చాలా చూద్దాం
చాలని పించేదాక రానిద్దాం
అంతా చేద్దాం అన్నీ చేద్దాం
ఆశలు తీరేదాకా ఆడేద్దాం
పైటంచు భారం మోసుకుంటూ
పైకి వెళ్లే చల్లగాలి పల్లకిలా
తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా
ముందు వెనక చూడకుండ
ఊహకైన అందకుండ
ఆరాటంలో ఓ ఓ
తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా నీపై వాలి పోతున్నా
జారిపోతున్నా మొత్తం మారిపోతున్నా