Dharma Daata (1970)

చిత్రం: ధర్మదాత (1970)

సంగీతం : టి.చలపతి రావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, కాంచన
దర్శకత్వం: ఎ. సంజీవి
నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
విడుదల తేది: 07.05.1970
చిత్రం: ధర్మదాత (1970)
సంగీతం : టి.చలపతి రావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల
జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి
లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి లాలి నా కల్పవల్లి
జో లాలి
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
జో లాలి జో లాలి
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపలా నిన్ను కాపాడు కోనా
కనుపాపలా నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
జో లాలి జో లాలి
👉 👉 👉  Bigg Boss 6 Telugu Vote   👈 👈 👈

Leave a Comment