Aswathama (2020)

చిత్రం: అశ్వద్ధామ (2020)

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్

సాహిత్యం: రమేష్ వాక చర్ల

గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల

నటీనటులు: నాగ శౌర్య, మెహరీన్, జిష్షు శంగుప్త

దర్శకత్వం: రమణ తేజ

నిర్మాత: ఉమా మల్పురి, శంకర్ ప్రసాద్ మల్పురి

విడుదల తేది: 31.01.2020


నిన్నే నిన్నే ఎదలో నిన్నే

చెలియా నీకై నేనే వేచానులే

అలుపే రాదే అదుపే లేదే

అయినా సమయం సరిపోదులే

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా

విరహాలే దూరంగా నిను చేరంగా

అమావాస్యే పున్నమిగా తోచే నువ్ నవ్వంగ

నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే

చెలియా నీకై నేనే వేచానులే

అలుపే రాదే అదుపే లేదే

అయినా సమయం సరిపోదులే

నా గుండెలో ప్రియ రాగాలే 

మోగే నీ కను సైగల్లో

నా కన్నుల్లో చెలి అందాలే 

నలిగే నీ నడువొంపుల్లో

కలలో ఇలలో ప్రతి ఊహల్లో

నువ్వే నా కనుపాపల్లో

మొదలో తుదలో ప్రతి ఘడియల్లో

చెలియా నువ్వే నాలో

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా

విరహాలే దూరంగా నిను చేరంగా

అమావాస్యే పున్నమిగా

తోచే నువ్ నవ్వంగ

నీలో నను చూసాక

నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే

చెలియా నీకై నేనే వేచానులే

అలుపే రాదే అదుపే లేదే

అయినా సమయం సరిపోదులే

Leave a Comment

Exit mobile version