అయినా మనిషి మారలేదు

వేషము మార్చెను
భాషను మార్చెను
మోసము నేర్చెను
అసలు తానే మారెను

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు

క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను
వాదము చేసెను
త్యాగమె మేలని
బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు

వేషమూ మార్చెను
భాషనూ మార్చెను
మోసము నేర్చెను
తలలే మార్చెను

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు

Leave a Comment

Exit mobile version