అడిగిన వరములనియ్యాలి
ఓ దీనదయా – దివ్యస్వరూపా 2
మీ దివ్య వరములు ఎన్నో విధములు
అడిగినవారికి అందించెదవు
అల్పుల గాంచుము – ఆత్మస్వరూపా
ఆత్మ నీయవే – దీనస్వరూపా ”అడిగిన”
మీ దివ్యమహిమను కనుగొనగలరా
మహిమ స్వరూపా – మనుజావతారా
మనసును మార్చవే – మరియతనయా
మహిమానేత్రములిచ్చి చూపవే ”అడిగిన”
పరమును విడచిన పావనరూపా
మరణము గెలచిన మహిమాస్వరూపా
నీవే మార్గము నీవే సత్యము ఆ…ఆ…ఆ…
నీవే జీవము జీవనరూపా ”అడిగిన”
పదివేలలో అతి సుందరుడవు
వందనమయ్యా ఓ యేసుదేవా
అందించుము నీ ఆత్మవరము ఆ…ఆ…ఆ…
అందుకొనుము – నా వందనములు ”అడిగిన”
Christian Songs